Fci Jobs : ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుండి 70,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. అన్ లైన్ ద్వారా అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరి అభ్యర్ధులకు 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : October 16, 2021 / 10:31 AM IST
Fci
Fci Jobs : ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 860 వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాచ్ మెన్ పోస్టుకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి ఐదు, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25సంవత్సరాలకు మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుండి 70,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. అన్ లైన్ ద్వారా అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరి అభ్యర్ధులకు 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అక్టోబరు 12 నుండి ధరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. ధరఖాస్తులకు చివరి తేదిని నవంబరు 10,2021గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://fci.gov.in