Tcs Jobs : టీసీఎస్ లో ఉద్యోగాలు…పీజీ పాసైన వారు అర్హులు
టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. టెన్త్, ఇంటర్ ఎన్ఐఓఎస్ ద్వారా పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- Guntupalli Ramakrishna
- Published On : March 17, 2022 / 07:24 AM IST
Tcs Jobs
Tcs Jobs : సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్స్‌ని నియమించేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తాజాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైనవారిని ఫ్రెషర్స్‌గా నియమించుకోవడానికి టీసీఎస్ అట్లాస్ హైరింగ్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ప్రస్తుతం టీసీఎస్ అధికారిక పోర్టల్‌లో అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
రిజిస్ట్రేషన్ పూర్తైనవారికి పరీక్ష సమాచారాన్ని అందిస్తుంది. బ్యాచ్‌లవారీగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూ సమాచారాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి 2022,2021లో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్‌లో ఎంఎస్సీ, ఎంఏ ఎకనమిక్స్ పాస్ అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022లో పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. టెన్త్, ఇంటర్ ఎన్ఐఓఎస్ ద్వారా పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల లోపు అనుభవం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి.
రిజిస్ట్రేషన్ చేయడానికి చివరి తేదీ ఏమీ లేదు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.tcs.com/careers/tcs-atlas-hiring సంప్రదించగలరు.
