June 2026 School Holidays : విద్యార్థులకి పండగే.. స్కూళ్లు తెరిచాక మళ్లీ సెలవలు.. ఎప్పుడెప్పుడంటే..!

June 2026 School Holidays : జూన్ లో ఇలా స్కూళ్లు తెరుస్తారో లేదో.. వెంటనే వరుస సెలవులు రాబోతున్నాయి

june 2026 school holiday list in andhra pradesh telangana

June 2026 School Holidays : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో సెలవులు పూర్తయ్యి.. స్కూళ్లు తెరుస్తారు. జూన్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తారు. అయితే జూన్ 12 న స్కూళ్లు ప్రారంభమైన తర్వాత కూడా విద్యార్థులకు పెద్ద సంఖ్యలో సెలవులు వస్తున్నాయి. మొత్తం జూన్ నెలలో 16 రోజులు సెలవులు రాబోతున్నాయి. అదెలా అంటే..

జూన్ 12 నుంచి ఏపీ, తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం అవుతాయి. అంటే ఇప్పటికే జూన్ లో 11 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ తర్వాత మరో 5 రోజులు సెలవులు రాబోతున్నాయి. అవి ఎప్పుడెప్పుడు అంటే..

  • జూన్ 13 – రెండో శనివారం
  • జూన్ 14 – ఆదివారం
  • జూన్ 21 – ఆదివారం
  • జూన్ 26 – మొహర్రం
  • జూన్ 28 – ఆదివారం

ఇలా జూన్ లో 11 రోజులు వేసవి సెలవులు.. ఆ తర్వాత వచ్చే 5 రోజుల సెలవులు కలుపుకుని మొత్తం 16 రోజులు సెలవులు రాబోతున్నాయి.

విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు కూడా జూన్ నెలలో వరుస సెలవులు రాబోతున్నాయి. పైగా ఈ సెలవులు వీకెండ్ తో కలిసిరావడంతో.. అవి కాస్త లాంగ్ వీకెండ్స్ గా మారబోతున్నాయి. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

ఇక జూన్ 26న మొహర్రం సెలవు. తెలంగాణ ప్రభుత్వం ముందురోజు అంటే జూన్ 25, గురువారంనాడు కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. కొందరు ఉద్యోగులకు శని, ఆదివారం వీకెండ్ సెలవులుంటాయి. అంటే జూన్ 27 శనివారం, జూన్ 28 ఆదివారం చాలా మంది ఉద్యోగులకు సెలవులే ఉంటాయి. ఇలా కొందరు ఉద్యోగులు జూన్ నెల చివర్లో వరుసగా నాలుగు రోజులు సెలవులు పొందే అవకాశం ఉంది. కనుక మరోసారి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు.