Kendriya Vidyalaya Admission 2026 27 : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026-27 ప్రారంభం.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి.. లేదంటే..!
Kendriya Vidyalaya Admission 2026 27 : కేవీల్లో అడ్మిషన్ల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే..
- Dharani Pilli
- Published On : March 20, 2026 / 02:51 PM IST
kendriya vidyalaya admission 2026 27 required documents and last date details here
Kendriya Vidyalaya Admission 2026 27 : తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలని భావిస్తున్న తల్లిదండ్రులకు కీలక అలర్ట్.. కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి, బాలవాటిక అడ్మిషన్ల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇదిలా ఉంటే నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారి జాబితా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు.
- 1వ తరగతిలో చేర్పించాలని భావిస్తే.. మీ పిల్లలకు మార్చి 31, 2026 నాటికి కచ్చితంగా 6 ఏళ్లు ఉండాలి.
- సీట్ల కేటాయింపులో ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగాల్లోని సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు.
- రిజర్వేషన్, కోటా విధానాల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ పిల్లల సీటు కోసం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయాలంటే ముందుగా మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు తప్పకుండా ఉండాలి. అవేంటంటే…
అవసరమైన పత్రాలు:
- పిల్లల జనన ధ్రువపత్రం.
- ఆధార్ కార్డు, ఫోటో.
- తల్లిదండ్రుల మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ.
- నివాస ధ్రువీకరణ పత్రం.
- EWS/రిజర్వేషన్ సర్టిఫికేట్లు (అవసరమైతే).
- ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికేట్ & ట్రాన్స్‌ఫర్ వివరాలు తప్పకుండా కావాలి.
