KVS Admission 2026 : కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక, ఒకటో తరగతి అడ్మిషన్లకు.. మరో 3 రోజులే అవకాశం.. త్వరపడండి

KVS Admission 2026 : కేంద్రీయ విద్యాలయాల్లో బాల వాటిక, ఒకటవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం దగ్గర పడుతుంది. ఆ వివరాలు..

kendriya vidyalaya Online registration for admission in Balvatika class I for the session 2026 27 will end on april 2

KVS Admission 2026 : ఈ సంవత్సరం కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ.. బాల్‌వాటిక, ఒకటవ తరగతి నుంచి 11వ క్లాస్ వరకు అడ్మిషన్లకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. బాల్‌వాటిక, 1వ తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంకా అప్లై చేసుకోని వారు త్వరపడండి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేవీఎస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ అడ్మిషన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏప్రిల్ 2, 2026వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు త్వరపడాలని సూచిస్తోంది. బాల్‌వాటికల్లో ప్రీ-ప్రైమరీ, ఆరేళ్లు నిండిన పిల్లలకు ఒకటో తరగతుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, రెండో తరగతి ఆపై తరగతులకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు

  • బాల్‌వాటిక 1: చేర్పించే చిన్నారుల వయసు మార్చి 31, 2026 నాటికి మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి.
  • బాల్‌వాటిక 2: నాలుగేళ్లు పూర్తయి, ఐదేళ్లు మించకూడదు.
  • బాల్‌వాటిక 3: అయిదేళ్లు నిండి ఆరేళ్లు మించకూడదు.
  • ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులకు: రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (బాల్‌వాటిక 1-3, 1వ తరగతి): మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు.
  • తొలి ప్రొవిజినల్ జాబితా (బాల్‌వాటిక 1-3): ఏప్రిల్ 8, 2026.
  • తొలి ఫైనల్ లిస్ట్ (బాల్‌వాటిక 1-3): ఏప్రిల్ 9, 2026.
  • రెండో ప్రొవిజినల్ జాబితా (సీట్ల ఖాళీల ఆధారంగా): ఏప్రిల్ 16, 2026.
  • మూడో ప్రొవిజినల్ జాబితా: ఏప్రిల్ 21, 2026.
  • ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ (బాల్‌వాటిక 2, ఆపై తరగతులు): ఏప్రిల్ 2 నుంచి 8, 2026 వరకు.
  • తొలి ఎంపిక జాబితా (ఆఫ్‌లైన్): ఏప్రిల్ 13, 2026.

11వ తరగతి ప్రవేశాలకు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.