KVS Admission 2026-27 : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు మొదలు… ఒక్కసారి సీటొస్తే.. 1-12 వ తరగతి వరకు ఫ్రీ.. ఇంగ్లీష్ మీడియం.. ఇలా అప్లై చేయాలి
KVS Admission 2026-27 : మీ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చాలని భావిస్తున్నారా.. అయితే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. త్వరపడండి
- Dharani Pilli
- Published On : March 20, 2026 / 02:20 PM IST
Kendriya Vidyalaya Sangathan KVS 2026 27 online applications starts for class 1 full details here
KVS Admission 2026-27 : కేంద్రీయ విద్యాలయాల్లో సీటు వస్తే చాలు ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్.. పైగా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన బోధనతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే తమ పిల్లలను కేవీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుంటారు. ఈక్రమంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక 1వ తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మార్చి 20 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కేవీల్లో తమ పిల్లలను చేర్చాలనుకునే తల్లిదండ్రులు.. KVS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 2, 2026. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
KVS అడ్మిషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది
కేంద్రీయ విద్యాలయాల్లో వివిధ కేటగిరీల (RTE, సర్వీస్ కేటగిరీలు) కోసం ఎంపిక అయిన విద్యార్థులు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారి జాబితాలను చూపించే తాత్కాలిక అడ్మిషన్ లిస్టుల విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది:
- బాలవాటిక మొదటి జాబితా: ఏప్రిల్ 8, 2026
- 1వ తరగతి మొదటి జాబితా: ఏప్రిల్ 9, 2026
- ప్రత్యేక షెడ్యూల్ (అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున): ఏప్రిల్ 10, 2026
- రెండవ జాబితా: ఏప్రిల్ 16, 2026
- మూడవ జాబితా: ఏప్రిల్ 21, 2026
ఎలా అప్లై చేయాలంటే..
కేవీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్‌ను అనుసరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు:
- అధికారిక KVS వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత అక్కడి నుంచి “Admission 2026” సెక్షన్‌లోకి వెళ్లండి
- హోమ్‌పేజ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
- ఇక్కడ అడిగిన వ్యక్తిగత, విద్యాసంబంధిత వివరాలను నమోదు చేయండి
- అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి
- అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి
- అవసరమైన ఫీజును చెల్లించండి
- ఫారమ్‌ను సమర్పించి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి
- డైరెక్ట్ లింక్: KVS Admission 2026-27 Registration
అర్హతలు
- ఒకటవ తరగతిలో అడ్మిషన్ కోసం 2026 మార్చి 31 నాటికి పిల్లల వయస్సు కనీసం 6 సంవత్సరాలు ఉండాలి
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ (Army/Defence) సిబ్బంది పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
- రిజర్వేషన్ కోటా విధానాల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది.
తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు
KVS అడ్మిషన్ 2026 ప్రక్రియను ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. ముందుగా దరఖాస్తు చేసి, ప్రొవిజనల్ లిస్టులను పరిశీలించడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ స్థితిని తెలుసుకోవచ్చు. ఎన్నికల కారణంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏ అభ్యర్థి కూడా నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు.
