×
Ad

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బజాజ్, దివిస్ కంపెనీలల్లో జాబ్స్.. పూర్తి వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించేందుకు చాలా(Job Mela) రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Mega Job Mela on September 6th in Prakasam district

Job Mela: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో జాబ్ మేళా నిర్వహించనుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, కుంభంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(స్కిల్ హబ్)లో సెప్టెంబ‌ర్ 6న ఈ జాబ్ మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. కాబట్టి, రాష్ట్రంలోని యువత తప్పకుండా ఈ అవకాశాన్ని(Job Mela) సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంకా ఈ జాబ్ మేళా గురించి మరింత సమాచారం కోసం 7997151082 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

AP District Court Jobs: మీరు 7వ తరగతి పాసయ్యారా.. నెలకు రూ.44 వేల జీతం.. ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

సంస్థలు, ఖాళీల వివరాలు:

రేస్ డైరెక్ట్ సర్వీసెస్ లో 20 పోస్టులు

స్విగ్గీ – ఫుడ్ డెలివరీ సేవలు లో 50 పోస్టులు

బజాజ్ అలియాంజ్ లో 20 పోస్టులు

క్రెడిట్‌ఆక్సెస్ గ్రామీణ్ లో 20 పోస్టులు

డివిస్ లో 30 పోస్టులు