NEET 2026 Refund : నీట్ యూజీ అభ్యర్థులకు కీలక అలర్ట్.. మరో 4 రోజులు మాత్రమే ఉంది.. ఇలా చేయకపోతే డబ్బులు రావు..!

NEET 2026 Refund : నీట్ అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది.

neet ug 2026 fee refund portal opened nta announces last date required bank details and application process

  • నీట్ అభ్యర్థులకు అలర్ట్
  • అందుబాటులోకి రీఫండ్ పోర్టల్
  • మే 27 వరకు మాత్రమే అవకాశం

NEET 2026 Refund : నీట్ యూజీ అభ్యర్థులకు కీలక అలర్ట్.. ఈ పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే రీఫండ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. తమ వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సమర్పించాల్సి ఉంది. ఈ వివరాలను ఇవ్వడానికి చివరి తేదీ 2026 మే 27. అంటే బుధవారం రాత్రి 11:50 గంటల్లోపు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఈ రీఫండ్ పోర్టల్ లో ఎంటర్ చేయాల్సి ఉందని నీట్ యూజీ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది.

నీట్ యూజీ పరీక్ష ఫీజు రీఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో NEET (UG) 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే “Refund Link” పై క్లిక్ చేసి.. ఆపై సదరు అభ్యర్థి తన బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి.

*దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం

బ్యాంకు ఖాతా వివరాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకుగాను.. అభ్యర్థులు అవసరమైతే రద్దు చేసిన చెక్కును కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఒకసారి వివరాలు సమర్పించాక వాటిని మార్చడానికి కుదరదు. వాటినే తుది వివరాలుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎలాంటి మార్పు చేయడానికి కూడా అవకాశం లేదని.. కనుక అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని NTA తెలిపింది.

బ్యాంకు వివరాలు

  • ఖాతాదారుని పేరు
  • బ్యాంకు అకౌంట్ నంబర్
  • IFSC కోడ్
  • బ్యాంకు పేరు
  • రద్దు చేసిన చెక్కు (తప్పనిసరి కాదు)

ఫీజు రీఫండ్ కోసం ఎలా అప్లై చేయాలి

  • ముందుగా క్యాండిడేట్లు NTA NEET అధికారిక వెబ్‌సైట్( https://neet.nta.nic.in/ ) ను సందర్శించాలి.
  • ఆ తర్వాత “NEET (UG) 2026 Fee Refund Window” లింక్‌ మీద క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత అభ్యర్థి తన బ్యాంకు ఖాతా వివరాలను అప్లోడ్ చేయాలి.
  • అవసరమైతే Cancelled Cheque ని కూడా అప్‌లోడ్ చేయవచ్చు.
  • వివరాలను ధృవీకరించిన తర్వాత.. Submit బటన్ మీద క్లిక్ చేయాలి.
  • మీ నీట్ యూజీ ఫీజు వాపసు ప్రక్రియ పూర్తయింది.

NTA అభ్యర్థులకు మరో కీలక ప్రకటన చేసింది. NEET (UG) 2026 ఫీజుకు సంబంధించి Chargeback ప్రక్రియను ప్రారంభించవద్దని కోరింది.

మళ్లీ పరీక్ష ఎప్పుడు

NEET (UG) 2026 పున: పరీక్షను జూన్ 21, 2026 (ఆదివారం) నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.

పరీక్ష సమయం:

  • మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

కొన్ని రోజుల క్రితం నిర్వహించిన NEET-UG పరీక్ష ప్రశ్నాపత్రం లీకవ్వడం.. అనేక అవకతవకల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో.. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పేపర్ లీక్ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.