NTPC : న్యూదిల్లీ ఎన్టీపీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 15, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 29, 2022గా నిర్ణయించారు.
- Guntupalli Ramakrishna
- Published On : July 18, 2022 / 02:46 PM IST
New Delhi Ntpc
NTPC : న్యూదిల్లీ కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయటనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
సివిల్, ఎలక్ట్రికల్, బిజినెస్ డెవల్‌పమెంట్, హైడ్రోజన్ కమర్షియల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎస్టిమేషన్, ఎలక్ట్రికల్ పీవీ లేఅవుట్, విండ్, సబ్ స్టేషన్ డిజైన్, సిస్టమ్ ఇంజనీరింగ్, స్విచ్‌యార్డ్, స్ట్రక్చర్స్, ఫౌండేషన్, సివిల్ పీవీ లైఔట్, హ్యూమన్ రిసోర్సెస్, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్ట్స్ సర్వీసెస్, ఫైనాన్స్, అకౌంట్స్, సేఫ్టీ, ఐటీ, పీ అండ్ ఎస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 15, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 29, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ntpc.co.in/ పరిశీలించగలరు.
