తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో LLB (LAW), LLM (పీజీ లా) కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే టీఎస్ లాసెట్/టీఎస్ పీజీ లాసెట్-2019 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల కాలపరిమితితో LLB కోర్సు, రెండేళ్ల కాలపరిమితితో LLM(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మార్చి 15 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. LLB ప్రవేశ పరీక్షకు SC, ST లకు ఫీజు రూ. 500, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మే 20న ఆన్‌లైన్ విధానంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
కోర్సులు | అర్హత |
LLB (మూడేళ్లు/ ఐదేళ్లు) | ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత. |
LLM (రెండేళ్లు) | LLB/ BL ఉత్తీర్ణత. |
* దరఖాస్తు ఫీజు: డిగ్రీ కోర్సుకు రూ.800, పీజీ కోర్సుకు రూ.1000
* ముఖ్యమైన తేదీలు..
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.03.2019
– ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.04.2019
– పరీక్ష తేదీ: 20.05.2019.