BPCL Recruitment : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
- Guntupalli Ramakrishna
- Updated on- October 2, 2022 / 02:00 PM IST
bharat petroleum
BPCL Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 57 టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ ఖాళీలు 40, మెకానికల్ ఇంజనీరింగ్ ఖాళీలు 6,ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఖాళీలు 6, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖాళీలు 5 ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైన గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 13, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల వరకు స్టైపెండ్ చెల్లి్స్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://portal.mhrdnats.gov.in పరిశీలించగలరు.
