Recruitment of Contract Jobs in Water and Power Consultancy Services India Limited
WAPCOS Recruitment : భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్‌కోస్ లిమిటెడ్)లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
విద్యార్హతలు, అనుభవం, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హతలున్నవారు నవంబర్ 15, 2022వ తేదీలోగా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన ఈ మెయిల్ ఐడీ wapcosrdss@gmail.com, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.wapcos.gov.in/ పరిశీలించగలరు.