Recruitment of job vacancies in Child Protection Unit, Hyderabad
WCDSC Hyderabad Recruitment : తెలంగాణ పరిధిలోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, ఔట్‌రీచ్ వర్కర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి సోషల్ వర్క్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్, రూరల్ డెవలప్‌మెంట్/సైకాలజీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, హోమ్‌సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎమ్, బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు పోస్టును బట్టి రూ.10,400ల నుంచి రూ.27,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; జిల్లా సంక్షేమ అధికారి, WCD&SC, హైదరాబాద్, కలెక్టరేట్ ఆవరణ, 1వ అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్-500001. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://wdcw.tg.nic.in/ పరిశీలించగలరు.