HCL Recruitment : హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్-2021, 2022లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి.

Hindustan Copper Limited
HCL Recruitment : భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి మైనింగ్ ఖాళీలు 2, సర్వే ఖాళీలు 6, జియోలజీ ఖాళీలు: 6, ఎలక్ట్రికల్ ఖాళీలు: 11, కాన్‌సెంట్రేటర్ ఖాళీలు 6, సివిల్ ఖాళీలు 5, మెకానికల్ ఖాళీలు 12, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఖాళీలు 2, సిస్టమ్ ఖాళీలు 1 ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్-2021, 2022లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 యేళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలు, గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసు కోవాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hindustancopper.com/