Multipurpose Health Assistant
Health Assistant Jobs : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : Telangana Govt : డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దరఖాస్తు చేసుకునే వారి విద్యార్హతలకు సంబంధించి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
READ ALSO : Gold Price Today: గోల్డ్ రేటు తగ్గింది..! తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలాఉన్నాయంటే..
అభ్యర్ధుల వయస్సు 18 – 44 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు మినహాయింపు వర్తిస్తుంది.
READ ALSO : Bharat Name Row: మన దేశానికి గతంలో అనేక పేర్లు.. అయితే భారత్ అనే పేరు ఎలా వచ్చింది?
రాత పరీక్ష, పని అనుభవం ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.31,040 – 92,050 చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19 చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm పరిశీలించగలరు.