NHAI Recruitment :
NHAI Recruitment : న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యుటేషన్ ప్రాతిపదికన 18 మేనేజర్ అడ్మినిస్ట్రేషన్/లీగల్, అసిస్టెంట్ మేనేజర్ లీగల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో సెంట్రల్/స్టేట్/యూనియన్ టెరిటరీ/యూనివర్సిటీ/ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పని చేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 56 యేళ్లకు మించకుండా ఉండాలి.
విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జవవరి 21లోపు ఈ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. అడ్రస్ ;డిజైన్ (HR & Adm.)-IB, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్లాట్ నెం: G – 5 & 6, సెక్టార్ – 10, ద్వారక, న్యూఢిల్లీ – 110075. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nhai.gov.in/ పరిశీలించగలరు.