BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూల అధారంగా ఉంటుంది. ఎంపికైన వారు విశాఖపట్నం, న్యూదిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులలో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు 2023 మార్చి 17గా నిర్ణయించారు.
- Guntupalli Ramakrishna
- Published On : March 6, 2023 / 02:57 PM IST
BEL Recruitment :
BEL Recruitment : బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్
టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ , ఐటీ)
తోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : Bloating : వేసవిలో కడుపు ఉబ్బరాన్ని నివారించే పానీయం ఇదే !
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూల అధారంగా ఉంటుంది. ఎంపికైన వారు విశాఖపట్నం, న్యూదిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులలో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు 2023 మార్చి 17గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https:// bel-india.in/ పరిశీలించగలరు.
