AECS Recruitment : అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీ

అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిపరేటరీ టీచర్, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 జీతంగా చెల్లిస్తారు.

Recruitment of teaching posts on contract basis in Atomic Energy Central Schools

AECS Recruitment : అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2023-24 ఏడాదికి గాను కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ నియామకాలను చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ తెలుగు, టీజీటీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పీఈటీ, ఆర్ట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డీఈఎల్‌ఈడీ, డిగ్రీ, పీ,ఈ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిపరేటరీ టీచర్‌, పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిపరేటరీ టీచర్, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌ కాపీలను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్‌, డి-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 21 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nfc.gov.in/ పరిశీలించగలరు.