Recruitment of teaching vacancies in Center of Bio Medical Research Lucknow
CBMR Recruitment : ఉత్తర్‌ప్రదేశ్ లఖ్నోలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఆఫ్ బయో మెడికల్ రిసెర్చ్ లో టీచింగ్ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ డివైజెస్, డేటా సైన్సెస్, అడ్వాన్స్‌డ్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఇమేజింగ్, సిస్టమ్స్ బయాలజీ, బయోలాజికల్ అండ్ సింథటిక్ కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలున్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 40 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లకు మించకుండా ఉండాలి.
విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,67,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,59,100ల నుంచి రూ.2,20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 19, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://cbmr.res.in/ పరిశీలించగలరు.