Ucil Jobs : యురేనియం కార్పొరేషన్ లో అప్రెంటిస్ ల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : May 8, 2022 / 10:49 AM IST
Ucil
Ucil Jobs : ప్రభుత్వరంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ గాను మొత్తం 130 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో మైనింగ్ మేట్, బ్లాస్టర్, వైండింగ్ ఇంజన్ డ్రైవర్ తదితర అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల పూర్తి వివరాలకు సంబంధించి మైనింగ్ మేట్ 80, బ్లాస్టర్ 20, వైండింగ్ ఇంజన్ డ్రైవర్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ; www.upenergy.in పరిశీలించగలరు.
