Indian Army : ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ లో పోస్టుల భర్తీ
అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : April 15, 2022 / 09:08 AM IST
Army Jobs
Indian Army : ఇండియన్ ఆర్మీకి చెందిన వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం పరిధిలో గ్రూప్ సీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి వార్డ్ సహాయక్ 51, హెల్త్ ఇన్ స్పెక్టర్ 19 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి లేదంటే తత్సమాన పరిక్ష ఉత్తీర్ణులై ఉండాలి. శానిటరీ ఇన్ స్పెక్టర్ కోర్సు సర్టిఫికెట్ తోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో స్వీకరిస్తారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; కమాండెంట్, కమాండ్ హాస్పిటల్(వెస్టర్న్ కమాండ్), చండీమందిర్, పంచకుల(హరియాణ)134107, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://indianarmy.nic.in/సంప్రదించగలరు.
