NHAI : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టీ సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : April 28, 2022 / 11:21 AM IST
Nhai Jobs
NHAI : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 5 జాయింట్ అడ్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులు 2, డేటా సైంటిస్ట్ పోస్టులు 2, జీఐఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 1 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 48 సంవత్సరాలకు మించరాదు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టీ సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 1,25,000 వరకు వేతనంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం విషయానికి వస్తే గేట్ స్కోర్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేది మే 22, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nhai.gov.in/ పరిశీలించగరలు.
