RRB NTPC Recruitment 2026 : డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!

RRB NTPC Recruitment 2026 : రైల్వే NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల్లో 3,548 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత, రూ.35,400 వరకు జీతం, దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 6, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలివే..

RRB NTPC Recruitment 2026

  • నిరుద్యోగులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్..
  • గ్రాడ్యుయేట్లకు భారీగా ఉద్యోగాలు
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులే 2,750..

RRB NTPC Recruitment 2026 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి అద్భుతమైన అవకాశం.. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు భారతీయ రైల్వేలో అదిరిపోయే ఛాన్స్.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) లాంచ్ చేసిన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ నంబర్ 06/2026 ద్వారా నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ విభాగంలో మొత్తం 3,548 పోస్టుల భర్తీ చేయనుంది.

ఈ నియామకాల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ : 2,750
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 371
  • జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 300
  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ : 127

అర్హతలు, వేతన వివరాలివే :
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత ఉండాలి. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

Read Also : Dasara Holidays : దసరాకు సొంతూళ్లకు వెళ్తున్నారా? మీ ఇంటికి తాళం వేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టుకు లెవల్-6 ప్రకారం.. నెలకు రూ.35,400 ప్రారంభ కనీస వేతనం లభిస్తుంది. మిగిలిన 3 పోస్టులకు లెవల్-5 ప్రకారం రూ.29,200 ప్రారంభ కనీస వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులు నిబంధనల ప్రకారం అందుతాయి.

ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం :
ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 అక్టోబర్ 8న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు కోసం నవంబర్ 6, 2026 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది. ఫీజు చెల్లింపునకు నవంబర్ 8 చివరి తేదీ. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం నవంబర్ 9 నుంచి 18 వరకు సమయం ఉంటుంది.

ఎంపికలో CBT-1, CBT-2 పరీక్షలు, అనంతరం ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉందని నోటిఫికేషన్ పేర్కొంది. అయితే, కంప్యూటర్, టైపింగ్ పరిజ్ఞానానికి సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి.

ఎక్కడ అప్లయ్ చేయాలి? :
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్, దరఖాస్తుల కోసం ఆర్ఆర్‌బీ పోర్టల్ విజిట్ చేయండి. అప్లయ్ చేసే ముందు పోస్టుల వారీ అర్హతలు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.