సౌత్ ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 1785 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
వయస్సు : అభ్యర్ధులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది: జనవరి 4, 2020.
దరఖాస్తు చివరి తేది : ఫిబ్రవరి 3,2020.