Telangana 10th Results 2026 : తెలంగాణ పది ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్.. మధ్యాహ్నం 2 గంటలకు.. వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెడితే చాలు
Telangana 10th Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 01:35 PM IST
telangana 10th results 2026 announced on april 29 afternoon 2 pm
- తెలంగాణ పది ఫలితాల విడుదలపై
- అధికారిక ప్రకటన వచ్చేసింది
- ఏప్రిల్ 29న రిజల్ట్
Telangana 10th Results 2026 : పదో తరగతి ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోన్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసింది. తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈనెల 29, బుధవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ విద్యాశాఖ.. SCERT లో ఫలితాలను విడుదల చేయనుంది. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. తెలంగాణలో మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 10 వేల మందికి పైగా సప్లీమెంటరీ విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది.
వాట్సప్ కి పది ఫలితాలు…
పదో తరగతి ఫలితాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కాక.. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు…
80969 58096 నంబర్ కి వాట్సాప్ లో ‘Hi’ అని మెసేజ్ చేసి,
‘SSC రిజల్ట్స్’ అని టైప్ చేసి,
ఆ తర్వాత హాల్‌టికెట్ నంబర్ ఇస్తే ఫలితాల వివరాలు వస్తాయని అధికారులు తెలిపారు.
