Free Bank Coaching : నిరుద్యోగులకు సర్కార్ బంపరాఫర్.. ఫ్రీగా బ్యాంకు కోచింగ్.. పూర్తి వివరాలివే..!
Free Bank Coaching : నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఉచితంగా బ్యాంక్ పరీక్షల కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
- Dharani Pilli
- Updated on- April 25, 2026 / 09:19 PM IST
telangana govt provide free bank coaching for sc st bc and women candidates apply before may 7
Free Bank Coaching :
బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు. మిగతా పరీక్షలకు ఇంట్లోనే ఉండి.. ఒక్కరే చదువుకోవడం చాలా కష్టం. తప్పకుండా కోచింగ్ తీసుకోవాల్సిందే. కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించక చాలా మంది ఆ దిశగా ప్రయత్నం చేయలేరు. అలాంటి వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా బ్యాంక్ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. బ్యాంకింగ్ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 100 మందికి ఉచితంగా బ్యాంకు పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నారు. వీరిలో
- 75 ఎస్టీలకు,
- 15 ఎస్సీలకు,
- 10 బీసీలకు ఉన్నారు.
అలాగే మొత్తం సీట్లలో 33⅓ శాతం మహిళలకు రిజర్వ్ చేశారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫ్రీగా బ్యాంక్ కోచింగ్ పొందాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు.. ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు.
ఎలా ఎంపిక చేస్తారంటే..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్న వారు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హులు. అలానే దీని కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు మించకూడదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆఫీసు పనివేళల్లో అంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.
