TG inter results 2026 : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్ పోస్ట్ పోన్.. ఫలితాలు విడుదలయ్యేది ఎప్పుడంటే..

TG inter results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంతకు ఫలితాలు విడుదలయ్యేది ఎప్పుడంటే..

Telangana inter results 2026 may delay board announces it in april third week

  • తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల వాయిదా
  • ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల
  • త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్న బోర్డు

Tg inter results 2026 : తెలంగాణలో ఇంటర్ విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు కూడా ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ రెండో వారం అనగా ఏప్రిల్ 12 లోగా ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. అయితే ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరికొన్నాళ్ల నిరీక్షణ తప్పదంటున్నారు. ఇంటర్ ఫలితాల విడుదల తేదీని మార్చారని సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారని తాజా సమాచారం. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో తెలంగాణ ఇంటర్ ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, మరో రెండు రోజుల్లో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అవుతుందని అంటున్నారు.

అయితే గతంలో ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లకుండా చూసేందుకు గాను డబుల్ చెక్ పద్ధతిని అనుసరిస్తున్నారు. అలాగే సాంకేతిక లోపాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి మూల్యాంకనం పూర్తయిందని.. అయితే తప్పులు దొర్లకుండా చూడటం కోసం మరోసారి ఫలితాలను చెక్ చేస్తున్నారు.

AP 2026 10th Results : పదో తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే..

మరీ ముఖ్యంగా కేవలం ఒక్క మార్కు తేడాతో, అలాగే ఒకే ఒక్క పేపర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో అధికారులు మరింత శ్రద్ధగా చెక్ చేస్తున్నారు. అలాంటి విద్యార్థుల జవాబు పత్రాలను మరొకసారి లెక్కిస్తున్నారు. ఈ విధానం వల్ల ఈసారి విద్యార్థులు ఎవరూ నష్టపోకుండా చూడటమే బోర్డు ధ్యేయం అంటున్నారు అధికారులు. అందుకే అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే విద్యార్థుల తుది ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది.

Telangana Govt Holidays : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు.. కారణమిదే

ఇంటర్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నారని సమాచారం. దీంతో ఫలితాల విడుదలపై ఆయన ఆమోదం కోసం బోర్డు అధికారులు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయడం, డేటా ప్రాసెసింగ్ వంటి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఫలితాల కోసం సిద్ధంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.