Telangana SSC Results 2026 : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్ విడుదల ప్రకటన.. ఏ రోజంటే..
Telangana SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీపై కీలక ప్రకటన వెలువడింది.
- Dharani Pilli
- Published on- April 28, 2026 / 06:50 AM IST
Telangana tenth class results 2026 will be on april 29 or 30
- పదో తరగతి ఫలితాల విడుదలపై అప్డేట్
- ఏప్రిల్ 29, 30న రిజల్ట్ విడుదల
- సన్నాహాలు చేస్తున్న అధికారులు
Telangana SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల ప్రకటన ఎప్పుడు అనే దానిపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 29 లేదా 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నాయని సమాచారం. ఈ రెండు రోజుల్లో ఏదో ఒకనాడు ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్న అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం మార్చి 14 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 13న పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఏప్రిల్ 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. అయితే మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తామని ముందు నుంచి చెబుతున్నా… ఇప్పుడు ఈ నెల 29న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది.
దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చాలా వరకు ఏప్రిల్ 29, బుధవారం నాడు ఫలితాలు విడుదల చేస్తారని.. ఒకవేళ వీలుకాని పరిస్థితుల్లో 30న వెల్లడిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు హాజరై ఫలితాలను విడుదల చేయనున్నారు.
