TG ICET 2026 : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జూలై 31 నుంచే ఐసెట్ ఫస్ట్ ఫేస్ కౌన్సెలింగ్‌.. ఫుల్ షెడ్యూల్‌ ఇదిగో..!

TG ICET 2026 : టీజీఐసెట్‌-2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రిలీజ్ అయింది. జూలై 31 నుంచి ఫస్ట్ ఫేస్ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

TG ICET 2026

TG ICET 2026 : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యా కమిషనర్ టీజీఐసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన సమక్షంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తొలి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం 22 హెల్ప్‌లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కన్వీనర్ పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం.. ఫస్ట్ ఫేస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ జూలై 31 నుంచి మొదలు కానుంది. జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆగస్టు 1 నుంచి 5 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఆగస్టు 3 నుంచి 8 మధ్య వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఉంది.

సీటు వస్తే ఫీజు చెల్లించాలి :
ఆగస్టు 8న వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ చేయనున్నారు. ఆగస్టు 11వ తేదీ లేదా అంతకన్నా ముందే సీట్ల కేటాయింపు ఉండొచ్చు. తొలి విడతలోనే సీటు వచ్చిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14 మధ్య వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఆపై సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయాలి.

Read Also : Karur Stampede : సీఎం విజయ్‌కి ఫస్ట్ షాక్..! ఆ ఆర్డర్స్ చెల్లవన్న మద్రాస్ హైకోర్టు

ఫైనల్ ఫేస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఆగస్టు 17న స్లాట్ బుకింగ్‌తో ప్రారంభం కానుంది. ఆగస్టు 18న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగనుంది. ఆగస్టు 18 నుంచి 19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ జరుగుతుంది. ఆగస్టు 22న లేదా అంతకన్నా ముందు ఫైనల్ ఫేస్ సీట్లను కేటాయిస్తారు.

ఆగస్టు 24న అడ్మిషన్ గైడ్‌లైన్స్ :
ఆగస్టు 22 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆగస్టు 22 నుంచి 25 వరకు కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు నేరుగా రిపోర్ట్ చేయాలి. కాగా, యూనివర్శిటీలు, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ కాలేజీల స్పాట్ అడ్మిషన్ల గైడ్ లైన్స్ ఆగస్టు 24న అధికారిక వెబ్‌సైట్‌ (TG ICET-2026) లో విడుదల కానున్నాయి.