TG Inter Results 2026 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది.. రిజల్ట్స్ వచ్చేది ఆ రోజే..
TG Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది
- Dharani Pilli
- Published On : April 10, 2026 / 05:14 PM IST
TGBIE officially Announces intermediate results released on april 12
- తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన
- ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదల
- ప్రకటించిన బోర్డు
TG Inter Results 2026 : ఇటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో రెండు రోజుల్లో అనగా ఏప్రిల్ 12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు చెక్ చేసుకోవడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలని సూచించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేస్తారని తెలుస్తోంది.
*తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు..! ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది ఉండగా.. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. వీరందరి భవితవ్యం మరో రెండు రోజుల్లో తేలనుంది.
*తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఈసారి కొత్త విధానం అమలు..
ఇదిలా ఉంటే ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫలితాల విడుదలపై నకిలీ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే ఫలితాల విడుదలను ఆలస్యం చేస్తుందని కొందరు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. దీంతో గురువారం ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ప్రకటన కూడా జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది.
