×
Ad

నేడే ఏపీ డీఎస్సీ ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలను శుక్రవారం (ఫిబ్రవరి 15) వెల్లడించనున్నారు.  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా అభ్యర్ధుల జనరల్ మెరిట్‌ జాబితాలను ప్రకటించనున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,902 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 47 సబ్జెక్టుల్లో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,08,155 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,05,547 మంది పరీక్షలకు హజరయ్యారు.