TS 10th Pass Percentage : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పై చేయి.. ఆ 6 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు.!

TS 10th Pass Percentage : పదో తరగతి ఫలితాల్లో 6 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

total pass percentage 95 15 in Telangana 10th class results 2026

  • పదో తరగతిలో 95.15 శాతం ఉత్తీర్ణత
  • 5731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
  • 96.26 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

TG 10th Results 2026 : తెలంగాణ విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పది ఫలితాలను విడుదల చేశారు. ఈసారి పదో తరగతిలో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం మొత్తం 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 6 పాఠశాలల్లో మాత్రం 0 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.

బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. ములుగులో 99.30 శాతం ఉత్తీర్ణత సాధించగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో 89.23 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ములుగు, నాగర్‌కర్నూల్, నిర్మల్ జిల్లాలు నిలవగా.. చివరి మూడు స్థానాల్లో హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు మాట్లాడుతూ.. 95 శాతం రిజల్ట్ రావడం చాలా మంచి పరిణామం.. పాఠశాల విద్యాశాఖ వారు ఈసారి చాలా మంచి వర్క్ చేశారు, దానివల్ల ఫలితాలు బాగా వచ్చాయి. పదో తరగతి పాస్ అయితే విద్యార్థులు చాలా వేగంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఉత్తీర్ణత సాధించిన అందరికీ అభినందనలు. ఫెయిల్ అయిన వారు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వెంటనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. బాగా చదివి పాస్ కావొచ్చు అని తెలిపారు.