TS Inter Results 2026 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఏ తేదీలో ఏ ఎగ్జామ్ అంటే..

TS Inter Advanced Supplementary Examinations 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21వరకు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19వ తేదీతోనే ముగుస్తాయి.

TS Inter Advanced Supplementary Examinations 2026

  • తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
  • మే 13వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం
  • మే 21వ తేదీ వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్

TS Inter Advanced Supplementary Examinations 2026: తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆధిత్యం విడుదల చేశారు. సాధారణంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరువుతారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు.. కొందరు విద్యార్థులు ఆశించిన మార్కులురాని సబ్జెక్టులను మళ్లీ రాస్తారు. ఒకవేళ మార్కులు తగ్గితే పాత మార్కులే ఉంటాయి కాబట్టి పరీక్ష ఫీజు చెల్లిస్తుంటారు.

Also Read : TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ప్లేస్ ఆ జిల్లాదే.. వాట్సాప్‌లో ఫలితాలు ఇలా తెలుసుకోండి..

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21వరకు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19వ తేదీతోనే ముగుస్తాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. గత ఫిబ్రవరిలో ఎవరైనా ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకాని వారు ఉంటే వారికి మే 22 నుంచి 25వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.

 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్:
♦ మే 13 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 (ఫస్టియర్); సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 (సెకండియర్)
♦ మే 14 (గురువారం): ఇంగ్లీష్ పేపర్-1 (ఫస్టియర్); ఇంగ్లీష్ పేపర్-2 (సెకండియర్)
♦ మే 15 (శుక్రవారం): మ్యాథ్స్-1A, బోటనీ-1, పొలిటికల్ సైన్స్-1 (ఫస్టియర్); మ్యాథ్స్-2A, బోటనీ-2, పొలిటికల్ సైన్స్-2 (సెకండియర్)
♦ మే 16 (శనివారం): మ్యాథ్స్-1B, జువాలజీ-1, హిస్టరీ-1 (ఫస్టియర్); మ్యాథ్స్-2B, జువాలజీ-2, హిస్టరీ-2 (సెకండియర్)
♦ మే 18 (సోమవారం): ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 (ఫస్టియర్); ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 (సెకండియర్)
♦ మే 19 (మంగళవారం): కెమిస్ట్రీ-1, కామర్స్-1 (ఫస్టియర్); కెమిస్ట్రీ-2, కామర్స్-2 (సెకండియర్)
♦ మే 20 (బుధవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-1 (ఫస్టియర్); పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-2 (సెకండియర్)
♦ మే 21 (గురువారం): మోడరన్ లాంగ్వేజ్-1, జాగ్రఫీ-1 (ఫస్టియర్); మోడరన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2 (సెకండియర్)

ఈ తేదీలు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా వర్తిస్తాయని, అయితే వారికి సంబంధించిన పూర్తి టైమ్‌టేబుల్‌ను ప్రత్యేకంగా విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.