Union Bank Of India Recruitment : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్ అధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 చివరి తేదిగా నిర్ణయించారు.

Union Bank Of India Recruitment : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 చార్టెర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు 3 ఖాళీలు ఉండగా, అభ్యర్ధులు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్ గా కనీసం 6 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 25 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి.

సీనియర్ మేనేజర్ పోస్టులు 34 ఉండగా, ఏదైనా డిగ్రీ అర్హతగా ఉండాలి. సీఏఐఐబీ, ఎంబీఏ ఫైనాన్స్, సీఎంఏ, సీఏ, సీఎఫ్ఏ, సీఎస్ అర్హత ఉండాలి. కనీస అనుభవం 4 సంవత్సరాలు ఉండాలి. ఎంఎస్ఎంఈ, కార్పోరేట్ క్రెడిట్ విభాగాల్లో పనిచేసి ఉండాలి. వయస్సు 25 నుండి 35 మధ్య ఉండాలి.

మేనేజర్ పోస్టులకు సంబంధించి 5 ఖాళీలు ఉండగా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సీఏఐఐబీ, ఎంబీఏ ఫైనాన్స్, సీఎంఏ, సీఏ, సీఎఫ్ఏ, సీఎస్ అర్హత ఉండాలి. కనీస అనుభవం 4 సంవత్సరాలు ఉండాలి. వయస్సు 22 నుండి 35 మధ్య ఉండాలి.

ఆన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్ అధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ibpsonline.ibps.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు