ADA Recruitment : బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.39,370 నుంచి రూ.46,990 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : August 22, 2023 / 01:00 PM IST
ADA
ADA Recruitment : భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం.. ఈనెల 28న ఢిల్లీకి .. ఎందుకంటే?
మెకానికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెటిరీయల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్ఫోసైన్స్, కమ్యునికేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/మెటలర్జీ/మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో 23, ఎయిరోనాటికల్/ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో 2, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 2, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫో టెక్/ఇన్ఫో సైన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/టెలీ కమ్యునికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో 48 ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Chiranjeevi : మొదటిసారి మనవరాలితో మెగాస్టార్ ఫోటో.. హ్యాపీ బర్త్‌డే చిరంజీవి తాత అంటూ చరణ్ స్పెషల్ పోస్ట్..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్సీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.39,370 నుంచి రూ.46,990 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెస్టెంబర్ 4, 07, 11, 14 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశం ; ఏడీఏ క్యాంపస్ 2, సురన్‌జన్‌దాస్ రోడ్, న్యూ థిప్పసంద్ర పోస్ట్, బెంగళూరు 560075. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.ada.gov.in/. పరిశీలించగలరు.
