Jobs : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 24,500 నుండి 90,000రూ వరకు వేతనంగా లభించే అవకాశం ఉంది.
- Guntupalli Ramakrishna
- Updated on- April 24, 2022 / 11:53 AM IST
Jobs (1)
Jobs : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీల వివరాలకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు 66 ఖాళీలు, టెన్నీషియన్ 25 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హులు, టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం పాటు అప్రెంటీష్ ట్రైనీ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ తోపాటు ఎస్ ఎస్ఎల్ టీ పూర్తి చేసిన వారు అర్హులు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 24,500 నుండి 90,000రూ వరకు వేతనంగా లభించే అవకాశం ఉంది. టెక్నీషియన్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 21,500 రూ నుండి 82,000రూ వరకు వేతనంగా పొందవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 30, 2022 దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ bel-india.in పరిశీలించగలరు.
