DAE Recruitment : డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

DAE Recruitment

DAE Recruitment : భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సంస్ధ లోని పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్‌ యూనిట్లలో మొత్తం 765 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఈఎస్‌ఎమ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

READ ALSO : Quail Bird Farming : కౌజు పిట్టలకు మార్కెట్ లో మంచి డిమాండ్.. నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం

అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మే 15, 2023వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dae.gov.in/ పరిశీలించగలరు.