Vacancies in Hindustan Petroleum Corporation Limited, who are eligible?
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబయి రిఫైనరీలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ పోస్టులు: 30, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్ పోస్టులు: 7, అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆపరేటర్ పోస్టులు: 18, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ పోస్టులు: 5 ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సు సర్టిఫికేట్‌తోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 25,
2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hindustanpetroleum.com పరిశీలించగలరు.