NDA Vacancies : నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

NDA Vacancies :

NDA Vacancies : పుణెలోని ఖడక్వస్లకు చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 251 పెయింటర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్‌, డ్రాఫ్ట్‌మెన్‌, సివిలియన్‌ మోటర్‌ డ్రైవర్, సైకిల్‌ రిపేయర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

రాత పరీక్ష, ట్రేడ్‌టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ndacivrect.gov.in/ పరిశీలించగలరు.