Sci Recruitment : భారత సుప్రీం కోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ

రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలక రూ.80,803ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 31, 2023వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.

Supreme Court of India - Examination Management Service

Sci Recruitment : సుప్రీం కోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 కోర్టు అసిస్టెంట్ గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్ టెక్నికల్ అసిస్టెంట్-కమ్-ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆప్‌ టెక్నాలజీ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్‌లో మాస్టర్స్‌డిగ్రీ/కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ లేదా కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్సీ/బీసీఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాదిపాటు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలక రూ.80,803ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 31, 2023వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, తిలక్ మార్గ్, న్యూఢిల్లీ-110001. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://main.sci.gov.in/ పరిశీలించగలరు.