BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎస్ఎస్ఎల్ సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : September 6, 2022 / 12:05 PM IST
Bharat Electronics Limited
BEL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ మచిలీ పట్నం కేంద్రంగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయటనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలను పరిశీలిస్తే ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ 4 ఖాళీలు, టెక్నీషియన్ 17 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఖాళీలు ఉండగా, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ విభాగాల్లో టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎస్ఎస్ఎల్ సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు 24, 500 నుండి 90,000 వరకు, టెక్నీషియన్ పోస్టులకు నెలకు 21,500 నుండి 82,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి గడువు తేదిగా 23 సెప్టెంబర్ 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bel-india.in పరిశీలించగలరు.
