SAI Recruitment : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అకౌంటింగ్‌/ఫైనాన్స్‌/కామర్స్‌ స్పెషలైజేషన్‌లో యూజీ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా సీఏ/ఐసీఎస్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

SAI Recruitment : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

Various job vacancies are filled in Sports Authority of India

Updated On : January 21, 2023 / 10:54 AM IST

SAI Recruitment : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 యంగ్‌ ప్రొఫెషనల్ (అకౌంట్స్‌/ఫైనాన్స్‌) పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అకౌంటింగ్‌/ఫైనాన్స్‌/కామర్స్‌ స్పెషలైజేషన్‌లో యూజీ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా సీఏ/ఐసీఎస్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 32ఏళ్లకు మించకుండా ఉండాలి.

అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 28, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sportsauthorityofindia.nic.in/sai/ పరిశీలించగలరు.