Vikram Sarabhai Space Center
VSSC Recruitment : కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)తిరువనంతపురంలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 సైంటిస్ట్, ఇంజినీర్(ఎస్‌డీ, ఎస్‌సీ) పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Low Calorie Indian Recipes : బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు కలిగిన భారతీయ వంటకాలు ఇవే !
స్పేస్ సైన్స్, ప్లానటరీ సైన్స్, కంట్రోల్ గైడెన్స్ అండ్ నేవిగేషన్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్,ఎక్స్‌పరిమెంటల్ కోల్డ్ ఆటమ్స్, అప్లైయిడ్ మెకానిక్స్, మెషిన్ డిజైన్, ప్రపల్షన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
READ ALSO : Plant Mango : మామిడి నాటేందుకు తొలకరి అనువైన సమయం.. మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రకాలు ఎంపిక
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సైంటిస్ట్,ఇంజినీర్ (ఎస్‌డీ) పోస్టులకు అట్నాస్పెరిక్ సైన్స్, స్పేస్ సైన్స్, ప్లానెటరీ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో మెటల్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్/ఎక్స్పరిమెంటల్ కోల్డ్ అటోమ్స్ స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఉండాలి.
READ ALSO : Mulching System : మల్చింగ్ సాగు.. లాభాలు బాగు
సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్‌సీ) పోస్టులకు కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్,కెమిలక్ సైన్ అండ్ టెక్నాలజీ,కెమకల్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో బీఈ,బీటెక్ పాసై ఉండాలి. మెకానికల్ డిజైన్,అప్లైడ్ మెకానికల్, ప్రొపల్షన్ ఇంజనీరింగ్,ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ తత్సమాన స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్ పాసై ఉండాలి.
ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 21, 2023వ తేదీ దరఖాస్తులు పంపేందుకు తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.vssc.gov.in/ పరిశీలించగలరు.