కొన్నేళ్ల క్రితం వరకు వూహాన్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు కరొన వైరస్ కు పుట్టిన ప్రాంతంగా చెడ్డపేరు మూటగట్టుకున్న వూహాన్ నిజానికి వైద్య విద్యకు కేంద్రం. విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి మెడిసిన్ కోసం ఇక్కడకు వస్తుంటారు.
నిజానికి తక్కువ ఖర్చుతో వైద్యకు వూహాన్ సూదంటురాయి. యేడాది క్రితం నుంచి ఇంగ్లీష్ లోనూ మెడిసిన్ అనగానే భారత్ నుంచి విద్యార్ధులు క్యూకట్టారు. మెడిసిన్ విద్యను అందించే వ్యూహాన్ తోపాటు 45 చైనా వైద్యవిద్యాలయల ముందు వందల మంది సీట్లుకోసం ఎదురుచూస్తూ కనిపిస్తారు.
2019 లెక్కల ప్రకారం 21వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ చైనా వైద్యకళాశాల్లలో చేరారు. డాక్టర్ కావాలనుకొనేవాళ్లకు చైనా దగ్గరదారి కదా. ఈ 45 కాలేజీలతోపాటు మరో 200లకుపైగా కాలేజీల్లో ఇండియన్ స్టూడెంట్స్ చదువుకొంటున్నారు. ఈ కాలేజీల్లో ఇంగ్లీషులో చదువకోవచ్చు.
కరొనా దెబ్బతో వూహాన్ నిర్మానుష్యమైపోయింది. ఎవరూ వీధుల్లోకి రావడంలేదు. పక్కనున్నవాళ్లతోనూ కలవడంలేదు. ఇళ్లుదాటడంలేదు. ఒక విధంగా విదేశీ విద్యార్ధులతో టాప్ ఎడ్యుకేషనల్ హబ్ గా కళకళ్లాడిన వూహాన్ ఇప్పుడు కరొనా వైరస్ కు పర్యాయపదంగా మారింది.