Rampur: రెండు స్థానాల్లో గెలిచి, ఒక స్థానంలో ఓడిన ఎస్పీ.. అయినా మరోసారి ఎన్నిక నిర్వహించాలంటున్న అఖిలేష్

ఇక రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజాపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా 34 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి ఈ స్థానం ఎస్పీకి చాలా కీలకం. ఆ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్, ఆయన కుటుంబం 1980 నుంచి విజయం సాధిస్తూ వస్తోంది. దీంతో ఆ స్థానంలో ఎస్పీ ఓడిపోయే ప్రసక్తే లేదని, ఎక్కడో తేడా జరిగిందన్నది అఖిలేష్ వాదన

Akhilesh Yadav As Party Loses Key Seat Want Repoll

Rampur: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఒక లోక్‭సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‭వాదీ పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షం అభ్యర్థులు రెండు చోట్ల గెలిచారు. మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గంలో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ విజయం సాధించారు. సుమారు 2.9 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యపై విజయం సాధించారు. ఇక కటౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‭దళ్ పార్టీ నుంచి మదన్ భైయా విజయం సాధించారు. ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజకుమారిపై విజయం సాధించారు.

Himachal pradesh: సీఎం రేసులో పోటాపోటీగా ఆ ముగ్గురు నేతలు

ఇక రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజాపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా 34 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి ఈ స్థానం ఎస్పీకి చాలా కీలకం. ఆ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్, ఆయన కుటుంబం 1980 నుంచి విజయం సాధిస్తూ వస్తోంది. దీంతో ఆ స్థానంలో ఎస్పీ ఓడిపోయే ప్రసక్తే లేదని, ఎక్కడో తేడా జరిగిందన్నది అఖిలేష్ వాదన. దీంతో ఆ స్థానానికి మరోసారి ఎన్నిక నిర్వహించాలని గురువారం ఫలితాల అనంతరం ఎన్నికల సంఘానికి అఖిలేష్ పిటిషన్ పెట్టుకున్నారు.

Hamirpur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నియోజకవర్గంలోని ఐదు స్థానాల్లోనూ ఓడిన బీజేపీ.. స్వల్ప మెజారిటీతో నడ్డా సేఫ్

ఈ విషయమై అఖిలేష్ మాట్లాడుతూ ‘‘ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇలా వ్యవహరిస్తే ఎన్నికల సంఘంపై ఎవరికి నమ్మకం ఉంటుంది? కొంత మందిని ఓటింగ్ వేయకుండా అడ్డుకున్నారు. దాడులు చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘంపై దీనికి సరైన రీతిలో స్పందించలేదు. ఈ నియోజకవర్గంలో మరోసారి ఎన్నిక నిర్వహించాలని నేను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను’’ అని అన్నారు. అయితే అఖిలేష్ డిమాండ్‭ను రాంపూర్ జిల్లా యంత్రాంగం పరిగణలోకి తీసుకోలేదని సమాచారం.