Karnataka Polls: స్పీడు పెంచిన కాంగ్రెస్.. ఒకేసారి 190 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన?

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్‌ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు

Karnataka Polls: తొందరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని సంకల్పంతో ఉన్న కాంగ్రెస్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీలో స్పీడు పెంచుతూ ఎన్నికలు వెళ్లాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఒకేసారి 190 మంది అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో మూడు రోజులుగా అగ్రనేతలు తలమునకలై ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా పర్యవేక్షణలో కసరత్తు కొనసాగింది.

Pune: అమ్మమ్మ గొలుసు లాక్కుంటున్న దొంగతో 10 ఏళ్ల చిన్నారి ఫైట్.. దెబ్బకు పారిపోయిన దొంగ

ఇక ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్‌ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. ఎన్నికల టికెట్ల పరిశీలనా కమిటీ అధ్యక్షుడు మోహన్‌ ప్రకాశ్‭తోపాటు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, శాసనసభలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య, విధానపరిషత్‌లో ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు.

MLA Rajaiah Vs Women Sarpanch : మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరగొచ్చని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ కంటే 2 శాతం ఎక్కువ ఓట్లు సాధించినప్పటికీ తక్కువ సీట్లతో విపక్షానికి పరిమతమైంది కాంగ్రెస్. మొదట జీడీఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది.

ట్రెండింగ్ వార్తలు