Maharashtra: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ-షిండే కూటమి.. సింగిల్ లార్జెస్ట్‭ పార్టీగా బీజేపీ

బీజేపీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీ 159 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత థాకరే గ్రూపు 153 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పార్టీ 143 స్థానాలు గెలుపొందింది. ఇక షిండే వర్గం అందరి కంటే తక్కువ స్థానాలను గెలుచుకుంది. 113 స్థానాలతో ఐదవ స్థానంలో ఉంది

Maharashtra Gram Panchayat Election Results Out

Maharashtra: మహారాష్ట్రలో జరిగి గ్రామ పంచాయతి ఎన్నికల్లో బీజేపీ-షిండే కూటమి అధిక స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి గెలుచుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లను ఈ కూటమి సాధించింది. కాగా, ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా మాత్రం భారతీయ జనతా పార్టీయే నిలిచింది. మొత్తం 1165 స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, అందులో 239 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

ఇక బీజేపీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీ 155 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత థాకరే గ్రూపు 153 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పార్టీ 143 స్థానాలు గెలుపొందింది. ఇక షిండే వర్గం అందరి కంటే తక్కువ స్థానాలను గెలుచుకుంది. 113 స్థానాలతో ఐదవ స్థానంలో ఉంది. ఈ ఐదు పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిసి 295 స్థానాలు గెలుచుకున్నారు.

బీజేపీ – షిండే కూటమికి 462 స్థానాలు రాగా.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి 451 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 1079 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల 86 స్థానాల ఫలితాలు విడుదల కాలేదు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం.. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన ఎన్నికలు ఇవే.

New Chief: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా సరే.. గాంధీ కుటుంబం చెప్పినట్లు వినాల్సిందేనట!