New Chief: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా సరే.. గాంధీ కుటుంబం చెప్పినట్లు వినాల్సిందేనట!

గాంధీ కుటుంబం కాకుండా ఎవరు ఎన్నికైనా వారు కేవలం రిమోట్ కంట్రోలే అని సీనియర్ కాంగ్రెస్ నేతే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శను ఆయన కొట్టి పారేశారు. ఇది ముందస్తుగా ఏర్పరుచుకున్న విమర్శ అని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో గాంధీ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ప్రజల్లో ఆదరణ ఉందని, వాటి దృష్ట్యానే నూతన అధ్యక్షులు గాంధీ కుటుంబం సలహా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

New Chief: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా సరే.. గాంధీ కుటుంబం చెప్పినట్లు వినాల్సిందేనట!

New Chief Must Listen To Gandhis' Views says P Chidambaram

New Chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి 24 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. పైగా ఈ ఎన్నికల్లో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులెవరూ పోటీలో లేకపోవడం గమనార్హం. అయితే అధ్యక్షులుగా పోటీలో పదవిలో లేకపోయినప్పటికీ.. అధికారం మాత్రం ఆ కుటుంబానికే ఉంటుందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన అనంతరం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరు గెలిచినా.. గాంధీ కుటుంబం చెప్పినట్లు వినాల్సిందే’’ అని తేల్చి చెప్పారు.

‘‘ఇప్పుడు జరిగే ఎన్నికతో గాంధీ కుటుంబం గొంతు తగ్గుతుందని ఎవరూ అనుకోవడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా గాంధీ కుటుంబం చెప్పినట్లు వినాల్సిందే’’ అని చిదంబరం అన్నారు. గాంధీ కుటుంబం కాకుండా ఎవరు ఎన్నికైనా వారు కేవలం రిమోట్ కంట్రోలే అని సీనియర్ కాంగ్రెస్ నేతే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శను ఆయన కొట్టి పారేశారు. ఇది ముందస్తుగా ఏర్పరుచుకున్న విమర్శ అని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో గాంధీ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ప్రజల్లో ఆదరణ ఉందని, వాటి దృష్ట్యానే నూతన అధ్యక్షులు గాంధీ కుటుంబం సలహా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

230 kmph: షాకింగ్ వీడియో.. కారు వేగం 230 కి.మీ.. బీఎండబ్ల్యూ కారు ప్రమాద ఘటనలో సంచలన వీడియో విడుదల

ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 9,000 మంది ఓటేయడానికి ఇందుకు అర్హులు. సోమవారం ఉదయమే ప్రారంభమైన ఈ పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నిక ఫలితాలు అక్టోబర్ 19న విడుదల కానున్నాయి. అయితే ఓటింగ్ ఎంత నమోదైందని మాత్రం పార్టీ పోలింగ్ కమిటీ వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుండడంపై పార్టీ నేతల్లో అనేక ఆశలు నెలకొన్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు వైపు నడిపించే నాయకత్వం కావాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. సోనియాతో పాటు ప్రియాంక గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. ఇక కీలక నేత రాహుల్ గాంధీ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సోనియా మాట్లాడుతూ.. ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూశానని పేర్కొన్నారు.

Dollar vs Rupee: నిర్మలా చెప్పింది నిజమేనా? రూపాయి విలువ తగ్గకుండా, డాలర్ విలువే పెరిగిందా?