Dollar vs Rupee: నిర్మల చెప్పింది నిజమేనా? రూపాయి విలువ తగ్గకుండా, డాలర్ విలువే పెరిగిందా?

అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ ఆర్థికలావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ప్రధానంగా ముడిచమురు కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు దాదాపుగా డాలర్లలోనే ఉంటాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడింది. ఫలితంగా వాటి ధరలు బాగా పెరిగాయి. దాంతో చెల్లింపులు చేసేందుకు అధిక డాలర్లను దేశాలు కొనడం ప్రారంభించాయి. ఫలితంగా డిమాండ్ పెరిగి డాలర్‌ రోజురోజుకు బలపడుతూ పోతోంది.

Dollar vs Rupee: నిర్మల చెప్పింది నిజమేనా? రూపాయి విలువ తగ్గకుండా, డాలర్ విలువే పెరిగిందా?

Did the dollar appreciate without depreciating the rupee?

Dollar vs Rupee: డాలర్, రూపాయి, యూరో, యెన్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశానికి సొంత కరెన్సీ ఉంటుంది. ఒక్కో కరెన్సీకి ఒక్కో రేటు ఉంటుంది. కారణం.. అంతర్జాతీయ మార్కెట్‭. ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు. తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికో లేదా అవసరమైన వాటిని కొనుక్కోవడానికో ఇతర దేశాల మీద ప్రతి దేశం ఆధారపడాల్సిందే. అయితే ప్రపంచ మార్కెట్‭లో అమ్మకాలు, కొనుగోళ్లు సాగాలంటే ఒక కరెన్సీ అంటూ ఉండాలి. వ్యాపారాలు, సమూహాలు సంస్థల్ని బట్టి కొన్ని కరెన్సీలు ఉన్నప్పటికీ మిగతా వాటితో పోలిస్తే డాలర్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేది డాలర్‭లోనే అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇకపోతే, ఈ మధ్య రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మన దేశ కరెన్సీ అయిన రూపాయి విలువ డాలర్‭తో పోల్చుకుంటే నానాటికీ పడిపోతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా.. ఆమె వింతైన సమాధానం చెప్పారు. ‘రూపాయి పడిపోవడం లేదు, డాలర్ విలువే పెరుగుతోంది’ అని ఇచ్చిన సమాధానంపై నెటిజెన్లు అయితే విపరీతంగా ట్రోల్స్ వేస్తున్నారు.

Andheri East By-Election: శివసేనకు పరోక్ష మద్దతు.. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్న బీజేపీ

ట్రోలింగ్ విషయం పక్కన పెడితే.. నిజంగానే నిర్మలా చెప్పినట్టు రూపాయి విలువ పడిపోవడం కాకుండా, డాలర్ విలువ పెరిగిందా అనేది చర్చలోకి తీసుకోవాల్సిన అంశం. ఇది తేలాలంటే ఒక దేశపు కరెన్సీ ఎందుకు పతనం అవుతుంది? ఎందుకు పెరుగుతంది? అనే విషయం తెలుసుకోవాలి. దీనిని ప్రభావితం చేసే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

– అంతర్జాతీయ మార్కెట్‭లో ఒక కరెన్సీకి ఉండే డిమాండ్, దాని సప్లైని బట్టి విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.
– ఒక దేశానికి చెందిన వస్తువులు, సేవలకు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ పెరగడమో, తగ్గడమో జరుగుతుంది.
– ద్రవ్యోల్బణం, వడ్డీ రెట్లు వంటివి కూడా కరెన్సీ విలువను మారుస్తూ ఉంటాయి.
– వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే మంచి రిటర్న్ వస్తుందనే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. ఆ పెట్టుబడలుకు అనుగుణంగా ఆ దేశ కరెన్సీ విలువ పరుగుతుంది.
– ఇక ధరల పెరుగుదల కూడా ప్రభావితం చేస్తుంది. ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. దాంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి నెమ్మదించి విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి.
– ఇలాంటి సమయంలో ధరల పెరుగుదలను కట్టడీ చేయడానికి ఆయా దేశాల సెంట్రల్ లేదంటే రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతాయి. తద్వారా కరెన్సీ విలువను పెంచేందుకు ప్రయత్నిస్తాయి.
– ప్రస్తుతం ఇండియాలో అదే జరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు పెంచిందంటే దేశంలో ధరల పెరుగుదల స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

Bombay HC: అత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. ఏడాదిలోపు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశం

ఇక డాలర్ బల పడుతోందా? ఒకవేళ బడితే ఎందుకు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే..

ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బాగా బలపడుతోందని తరుచూ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచితే కరెన్సీ విలువ పెరుగుతుందని పైన చెప్పినట్లే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడీ చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది. వడ్డీ రేట్లతో మదుపు చేసే వారి సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగానే పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో డాలర్ మారకం విలువ పెరిగింది.

డాలర్ బలపడడానికి మరొక కారణం కూడా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ ఆర్థికలావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ప్రధానంగా ముడిచమురు కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు దాదాపుగా డాలర్లలోనే ఉంటాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడింది. ఫలితంగా వాటి ధరలు బాగా పెరిగాయి. దాంతో చెల్లింపులు చేసేందుకు అధిక డాలర్లను దేశాలు కొనడం ప్రారంభించాయి. ఫలితంగా డిమాండ్ పెరిగి డాలర్‌ రోజురోజుకు బలపడుతూ పోతోంది. ఈ రెండింటితో పాటు డాలర్ విలువ పెరగడానికి మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే.. డాలర్‭ను సురక్షితంగా భావించడం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడినప్పుడు బంగారం మాదిరిగానే పెట్టుబడికి డాలర్‭ను సురక్షితమైందిగా ఉపయోగిస్తున్నారు.

చివరగా రూపాయి బలహీనపడుతోందా అనే విషయం చర్చించుకుంటే..

అంతర్జాతీయ విపణిలో ఏం కొనాలన్నా.. డాలర్ కేంద్రంగా ఉందనే విషయం ముందుగానే చెప్పుకున్నాం. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మారకం పూర్తిగా డాలర్లలోనే జరుగుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారత్ ఏం కొనాలన్నా దానికి ముందు డాలర్ కొనాల్సి వస్తోంది. కొనుగోళ్లు ఎంత పెరిగితే అన్ని ఎక్కువ డాలర్లు కొనాల్సి వస్తోంది. ఇక ప్రపంచ విపణిలో ధరల మార్పు వల్ల కూడా కొన్నిసార్లు ఎక్కువ డాలర్లు కొనాల్సి వస్తోంది.

ఉదాహరణకు.. 2019 అగస్టులో డాలర్ విలువ సుమారు 70 రూపాయలుగా ఉంది. నాడు బ్రెంట్ ధర దాదాపుగా 60 డాలర్లుగా ఉంది. అంటే ఒక బ్యారెల్ ముడిచమురు కొనడానికి నాడు భారత్ సుమారు రూ.4,200 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుతం డాలర్ విలువ దాదాపు 82 రూపాయలు. బ్రెంట్ ధర ప్రస్తుతం 92 డాలర్లు. ఇప్పుడు ఒక బ్యారెల్ ముడిచమురు కొనాలంటే రూ.7,544 ఇవ్వాల్సి ఉంటుంది. డాలర్‭కు ఎక్కువ డిమాండ్ పెరగడం వల్ల డాలర్ విలువ పెరిగి.. రూపాయి విలువ తగ్గుతోంది. దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇండియాలోని పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో రూపాయి నానాటికీ పతనం అవుతోంది.

Congress President Poll: ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. 19న ఫలితాలు