Andheri East By-Election: శివసేనకు పరోక్ష మద్దతు.. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్న బీజేపీ

పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీలేవీ పోటీకి దూరంగానే ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఉన్నాయి. ఇక ఏక్‌నాథ్ షిండే కూడా ఏకగ్రీవానికి సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Andheri East By-Election: శివసేనకు పరోక్ష మద్దతు.. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్న బీజేపీ

BJP won't contest Andheri East Assembly by election

Andheri East By-Election: అనుకున్నట్టుగానే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక నుంచి భారతీయ జనతా పార్టీ తప్పుకుంది. అంధేరి నియోజకవర్గంలో రుతుజ లట్కే పోటీ చేస్తున్నందున ఆమెకు పోటీగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపవద్దని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌‭ను కోరుతూ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే ఆదివారం లేఖ రాశారు. దీనికి అనుగుణంగా సోమవారం బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ముర్జి పటేల్ సోమవారం ఈ ప్రకటన చేశారు.

పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీలేవీ పోటీకి దూరంగానే ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఉన్నాయి. ఇక ఏక్‌నాథ్ షిండే కూడా ఏకగ్రీవానికి సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ముందుగా పోటీకి సై అంటే సై అన్న షిండే వర్గం, బీజేపీ అనుకున్నట్లుగానే అభ్యర్థిని బరిలోకి దింపినప్పటికీ.. రాజ్ థాకరే లేఖతో నిర్ణయాలు మారిపోయాయి. దివంగత ఎమ్మెల్యే రమేష్ లట్కే భార్య రుతుజ లట్కే పోటీలో ఉన్నందున, ఆ నేతకు నివాళిగా ఆమెపై ఎవరినీ పోటీలోకి దింపవద్దని ఫడ్నవిస్‌కు రాసిన లేఖలో రాజ్ థాకరే కోరారు. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ తరఫున రుతుజ లట్కే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Neelakurinji flowers : 12ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురుంజి పూలని చూడాలని 87 ఏళ్ల తల్లి కోరిక..2 కిలోమీటర్లు మోస్తూ.. తీసుకెళ్లి చూపించిన కొడుకులు